Kriti Shetty: అందరికీ ఒకే నియమం ఉండదు.. పని గంటల వివాదంపై కృతి శెట్టి క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి, సినీ పరిశ్రమలో పని గంటలపై జరుగుతున్న చర్చకు స్పందించారు. కొందరు నటీమణులు రోజుకు 8 గంటలకే పరిమితమవుతున్నట్టు వెల్లడిస్తున్న నేపథ్యంలో పని గంటలు ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు. అందరికీ ఒకేరకమైన నియమాలు వర్తించవని, సినిమా రంగంలో పనిచేసే విధానం వ్యక్తిగత జీవనశైలి, వృత్తి దృక్పథంపై ఆధారపడుతుందని పేర్కొన్నారు. తాజా తమిళ చిత్రం 'వా వాతియార్' ప్రమోషన్‌లో భాగంగా ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ సినిమాలో ప్రతి ఒక్కరి పని విధానం భిన్నంగా ఉంటుంది.
Details
అవసరమైతే 24 గంటలు పనిచేస్తా
ముఖ్యంగా నటీమణులు తమ జీవనశైలి, పనితీరుకు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఎవరికి ఏది సౌకర్యంగా ఉంటుందో వారు నిర్ణయించుకోవాలని అన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, ప్రస్తుతం తనపై కుటుంబ బాధ్యతలు తక్కువగా ఉన్నందున అవసరమైతే 24 గంటలు పనిచేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. డైరెక్టర్ 13 గంటలు సెట్‌లో ఉండమంటే నేను తప్పకుండా ఉంటాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో హైదరాబాద్, చెన్నైల్లో డబుల్ షిఫ్టులు కూడా చేశాను. అయితే కొందరు నటీమణులు తక్కువ గంటలు పనిచేస్తామని చెబితే దాన్ని నేను తప్పుగా చూడను... అది వారి నిర్ణయమని వివరించారు.
Details
ముందుగా చర్చించుకోవాలి
పని గంటలపై ముందస్తుగా చర్చించడం వల్లనే ఎక్కువ సమస్యలు నివారించవచ్చని కృతి సూచించారు. ఒక నటి ఎన్ని గంటలు పనిచేయగలదో నిర్మాతలు-దర్శకులకు ముందే తెలిపి ఉంటే, వారు దానికి అనుగుణంగా షూట్‌ను ప్లాన్ చేస్తారు. అవసరమైతే మరో నటిని కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ముందస్తు చర్చలే ఈ అంశానికి సరైన పరిష్కారమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.