Page Loader
ఈ వారం థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాలివే..!
రంగ బలి సినిమాలో నాగశౌర్య, యుక్తితరేజా

ఈ వారం థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాలివే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 03, 2023
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాక్సాఫీస్ వద్ద ఈనెల 7న చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి.దీంతో థియోటర్ల దగ్గర సందడి కాస్త గట్టిగానే ఉండనుంది. ఈ వారం దాదాపుగా ఆరడజను పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ జాబితాలో నాగశౌర్య, యుక్తితరేజా నటించిన రంగబలి ముందు వరుసలో ఉంది. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కథనాయికగా యుక్తి తరేజా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించిన రుద్రంగి, అర్జున్, జెడీచక్రవర్తి నటించిన 'ఇద్దరు' ఈనెల 7న విడుదల కానున్నాయి. సింహా కోడూరి హీరోగా చేసిన 'భాగ్ సాలే' సినిమా కూడా ఆ రోజునే రిలీజ్ కు సిద్ధమైంది. నేహా సొలంకి కథనాయికగా నటించిన ఈసినిమాతో దర్శకుడిగా ప్రణీత్ పరిచయమవుతున్నాడు.

Details

జగపతి బాబు సినిమాపై భారీ అంచనాలు

ఇక విలనిజంతో రుద్రంగి మూవీలో పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్న జగపతిబాబు సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఓ సాథియా, సర్కిల్, 7:11 సినిమాలపై కూడా అందరిలో ఆసక్తి ఎక్కువగానే ఉంది. మరి ఈ అరడజను సినిమాలో ఏదీ బ్లాక్ బస్టర్ అవుతుందో, ఏ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే. అదేవిధంగా సాయికుమార్‌, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్‌, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల తదితరులు ముఖ్య పాత్రలో నటించిన నాతో నేను సినిమా కూడా ఈ నెల ఏడవ తేదీన విడుదల కానుంది.