Animal: యానిమల్‌తో పాటు విడుదలయ్యే సినిమాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం థియోటర్లలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధమయ్యాయి.
బాక్సాఫీస్ వద్ద తమ టాలెంట్ ఏంటో చూపడానికి హీరోలు సిద్ధమయ్యారు. రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం 'యానిమల్' (Animal) డిసెంబర్ 1న భారీ విడుదల కానుంది.
తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో ఆలరించడానికి ఈ మూవీ సిద్ధమైంది. రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తికపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ స్దాయి బజ్ ఉన్న చిత్రం రిలీజ్ రోజున సాధారణంగా ఎవరూ తమ సినిమా రిలీజ్‌లు పెట్టుకోరు.
అయితే కొన్ని సినిమాలు మాత్రం బరిలోకి దిగుతున్నాయి.
Details
నయనతార నటించిన 'అన్నపూరణి' డిసెంబర్ 1 రిలీజ్
సుడిగాలి సుధీర్ నటించిన 'కాలింగ్ సహస్ర' కూడా రిలీజ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ కన్సెప్ట్ తో సుధీర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరోవైపు 'అథర్వ' మూవీ కూడా ఈసారి బరిలోకి దిగుతుండడం విశేషం. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తుండగా, మహేష్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
'ఉపేంద్ర గాడి అడ్డా' అనే మరో చిన్న చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఇక నయనతార 'అన్నపూరణి' తెలుగు వర్షెన్ కూడా డిసెంబర్ 1న విడుల కానుంది.
ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్ట్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా యానిమల్ మూవీ ఉంటుందని డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలిపారు.
దీంతో యానిమల్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.