Page Loader
Telugu movies this week: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!
ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!

Telugu movies this week: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 25, 2024
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ఆలరించడానికి థియేటర్లలో కొత్త సినిమాలు, ఓటిటిల్లో పలు హిట్‌ చిత్రాలు సిద్ధమయ్యాయి. ప్రేమ, యాక్షన్, థ్రిల్‌ ఇలా విభిన్నమైన అంశాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. రొటి కపడా రొమాన్స్ కొత్త అంశాలను అందించాలనే ప్రయత్నంగా రూపొందిన చిత్రం 'రోటి కపడా రొమాన్స్‌'. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ బొజ్జం నిర్మించారు. హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి రానుంది.

Details

నవంబర్ 29న మిస్ యూ

భైరతి రణగల్‌ శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కన్నడ హిట్ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 29న తెలుగులో విడుదలకు సిద్ధమైంది. రాహుల్ బోస్, రుక్మిణి వసంత్ ముఖ్య పాత్రల్లో నటించగా, నర్తన్ దర్శకత్వం వహించారు. మిస్‌ యూ లవ్, కామెడీ, యాక్షన్ అంశాలతో రూపొందిన 'మిస్‌ యూ' నవంబర్ 29న తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. సిద్ధార్థ్‌, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలు పోషించగా, ఎన్. రాజశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Details

 ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమైన చిత్రాలు/సిరీస్‌లు

బాక్సాఫీస్‌ వద్ద అద్భుతమైన విజయం సాధించిన 'క' మూవీ, ఈటీవీ విన్‌లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ బ్లడీ బెగ్గర్‌ (తమిళ్‌) - నవంబర్ 29 నెట్‌ఫ్లిక్స్‌ సికిందర్‌ క ముకద్దర్‌ (హిందీ) - నవంబర్ 29 ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్ షో) - నవంబర్ 30 ది ట్రంక్‌ (కొరియన్‌) - నవంబర్ 29 అవర్‌ లిటిల్‌ సీక్రెట్‌ - నవంబర్ 27 ఫైండ్‌ మి ఇన్‌ పారిస్‌ (ఇంగ్లీష్‌) - నవంబర్ 28 ది స్నో సిస్టర్‌ (ఇంగ్లీష్‌) - నవంబర్ 29 ది మ్యాడ్‌నెస్‌* (ఇంగ్లీష్‌) - నవంబర్ 28

Details

 డిస్నీ+హాట్‌స్టార్‌

పారాచూట్‌ (వెబ్‌సిరీస్‌) - నవంబర్ 29 జీ5 వికటకవి (వెబ్‌సిరీస్‌) - నవంబర్ 28 డివోర్స్‌ కే లియా కుచ్‌ బీ కరేగా (హిందీ) - నవంబర్ 29 సన్‌ నెక్ట్స్‌ కృష్ణం ప్రణయ సఖి (కన్నడ) - నవంబర్ 29