Naga Chaitanya : నన్ను క్రిమినల్‌లా చూశారు.. సమంతతో విడాకులపై నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించారు.
సినిమా విడుదలైన తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, నాగ చైతన్య కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Details
పరస్పర అంగీకారంతోనే విడిపోయాం
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ చైతన్య ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా సమంతతో తన విడాకుల గురించి తొలిసారి మాట్లాడాడు.
తన లైఫ్‌లో జరిగినదే చాలా మంది జీవితాల్లో జరుగుతుందని, కానీ తనను క్రిమినల్‌లా చూశారని చెప్పారు.
ఒక రిలేషన్‌షిప్‌ను బ్రేక్ చేయాలని అనుకుంటే, తాను వేయి సార్లు ఆలోచిస్తానని, ఎందుకంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు అని చెప్పారు.
సమంత, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, ఎవరి దారిలో వాళ్లం ముందుకెళ్తున్నామని చెప్పారు.
కానీ తమ వ్యక్తిగత విషయం అనుకోకుండా పెద్ద టాపిక్ అయిందని, కొందరికి గాసిప్, ఇంకొందరికి ఎంటర్‌టైన్‌మెంట్ లా అయిపోయిందన్నారు.
Details
పుల్ స్టాప్ పెట్టాలి
ఈ సమయంలో తాను మాట్లాడితే మరిన్ని ఆర్టికల్స్ వచ్చేవని, రాసేవాళ్లకు ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంది? తన జీవితంపై దృష్టి పెట్టడం మానేసి, మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలని నాగ చైతన్య స్పష్టం చేశాడు.
ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో విడాకుల అంశంపై ఎక్కడా మాట్లాడని చైతు, ఈసారి తన మనసులోని మాటను బయటపెట్టడంతో ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న నాగ చైతన్య మాటలు
నేనూ కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. విడాకులు తీసుకుంటే వచ్చే భాద ఏంటో నాకు తెలుసు.
— TeluguMirchi (@TeluguMirchiCom) February 8, 2025
నేను సమంత ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారిలో వాళ్ళు, ఎవరి జీవితాలు వాళ్లు లీడ్ చేస్తున్నాం. కానీ అది అనుకోకుండా ఒక పెద్ద టాపిక్ అయిపోయింది - చై #NagaChaitanya #Thandel pic.twitter.com/OnFDYLFeLL