Devara: దేవర నుంచి మూడో పాట రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' చిత్రంలోని మూడో సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ మూడో సాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'దావుదీ' అంటూ విడుదలైన ఈ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్పులతో అదరగొట్టారు. ఫుల్ ఎనర్జీతో కూడిన స్టెప్‌లతో ఈ సాంగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ చేసింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతానికి ఫ్యాన్స్ పిధా అవుతున్నారు. దేవర చిత్రంలోని ఈ మూడో పాటకు రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.