SSMB29: 'కుంభ' పాత్రపై పృథ్వీరాజ్ స్పందన ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, భాషతో సంబంధం లేకుండా అనేక రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించడం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటిస్తున్న 'విలాయత్ బుద్ధా' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని, తన కెరీర్, అభిమానులు, విమర్శలపై ఓపెన్‌గా మాట్లాడారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, "నేడు నేను ఉన్న స్థానం పూర్తిగా ప్రేక్షకుల వల్లే. వాళ్ల ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. అదే సమయంలో విమర్శల హక్కు కూడా వారికి ఉంది. నేను తప్పు చేస్తే వారు చెప్పాలి, నేను గౌరవంగా వినాలి. వారి సూచనలు, సలహాలు నా విజయాలకు ప్రధాన కారణమన్నారు.
Details
కుంభ పాత్రపై అభిమానుల్లో భారీ అంచనాలు
అయితే, అభిమానులు ఎదురుచూస్తున్న SSMB29 ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే తెలిసింది. ఆయన 'కుంభ' పాత్ర లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే, రాజమౌళి తన ప్రతిభను ప్రశంసించిన విషయంపై స్పందిస్తూ, "లెజెండరీ దర్శకుడి నుంచి ప్రసంసలు రావడం చాలా అరుదు. ఆయన చెప్పిన ప్రతి మాట నాకు గౌరవంగా ఉందని తెలిపారు. తన పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు "సమయం వచ్చినప్పుడు చెబుతానని క్లారిటీ ఇచ్చారు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనున్న భారీ ఈవెంట్ #GlobeTrotter - SSMB29కు పృథ్వీరాజ్ హాజరుకానున్నారు. ఇప్పటికే 'కుంభ' పాత్రపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.