LOADING...
Chiranjeevi- Pawan Kalyan: చిరంజీవి నో చెప్పిన కథతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇదే!
చిరంజీవి నో చెప్పిన కథతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇదే!

Chiranjeevi- Pawan Kalyan: చిరంజీవి నో చెప్పిన కథతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా కథల ఎంపికలో ప్రతి హీరోకు తనదైన శైలి ఉంటుంది. కొందరు హీరోలు దర్శకుడు కథ చెప్పే సమయంలోనే సినిమా ఫలితాన్ని అంచనా వేసేస్తారు. కథ తమకు సూటవుతుందని అనిపిస్తే వెంటనే ఓకే చెబుతారు. లేదంటే సున్నితంగా రిజెక్ట్ చేయడమో, లేదా కొన్ని మార్పులు చేర్పులు సూచించడమో చేస్తుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 150కు పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆయన సొంతం.

Details

 పవన్ కు సెట్ అవుతుందని చెప్పిన చిరు

ఓ సినిమా చేయాలా? వద్దా? చేస్తే హిట్ అవుతుందా? ప్రేక్షకులకు నచ్చుతుందా? అన్న అంశాలను ఎంతో లోతుగా విశ్లేషించిన తర్వాతే చిరంజీవి సినిమాలను ఎంపిక చేసుకుంటారు. అలా ఓ సినిమా కథ విషయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన ఇప్పుడు తెలిసింది. ఓ దర్శకుడు చిరంజీవి వద్దకు కథ తీసుకువెళ్లగా, ఆయన ఆ కథను ఎంతో ఆసక్తిగా విని 'చాలా బాగుంది' అని ప్రశంసించారు. అయితే ఆ స్టోరీ తన ఇమేజ్‌కు పూర్తిగా సెట్ కాకపోవచ్చని అభిప్రాయపడ్డ చిరంజీవి, అదే కథ పవన్ కల్యాణ్‌కు బాగా సరిపోతుందని సూచించారట. అలా చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా 'అన్నవరం'.

Details

యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకున్న 'అన్నవరం'

సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన 'అన్నవరం' సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్‌గా నటించగా, 'ప్రేమిస్తే' ఫేమ్ సంధ్య పవన్ కళ్యాణ్ సోదరి పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో మూవీ నిలవలేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సహజంగా ఉండే మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో కొరవడటమే ప్రధాన మైనస్‌గా మారింది. అయితే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల దృష్టిలో మాత్రం ఈ సినిమా కమర్షియల్‌గా సేఫ్ ప్రాజెక్ట్‌గానే నిలిచిందని దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Advertisement