
HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎక్కువసార్లు చూసిన సినిమా ఇదే.. షాకైన అభిమానులు!
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్—ఈ పేరు పలికితేనే అభిమానులకు తెలియని పులకరింపు వస్తుందని చెబుతుంటారు. ఆయన పేరు వినగానే నిద్రలో కూడా ముసిముసి నవ్వులు నవ్వుకునే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో పరిస్థితి వేరే రేంజ్‌లో ఉంటుంది. రాజకీయపరంగా ఆయన పలు మీటింగ్స్, రోడ్‌షోలు నిర్వహించినప్పుడు అమ్మాయిల అల్లరి అదిరిపోతుంది. అప్పటికే ఆయనకు పెళ్లయి, పిల్లలు ఉన్నా కూడా పబ్లిక్‌గా 'ఐ లవ్ యు సర్' అంటూ పెద్దల సమక్షంలోనే చెప్పేసిన సందర్భాలున్నాయి. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలా సరదాగా తీసుకుంటూ అమ్మాయిలు ఇలా రౌడీలా తయారైపోతే ఎలా?అని హాస్యంగా స్పందించారు. అలాంటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఆయన అభిమానులు ఊరుకోకుండా సోషల్ మీడియా వేదికగా రచ్చరంబోలా చేస్తున్నారు.
Details
పవన్ పేరుతో హ్యాగ్ ట్యాగ్ లు ట్రెండ్
ఆయన పేరు, సినిమాలకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ అనేక సినిమాల్లో నటించి సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నప్పటికీ, ఆయన తన కెరీర్‌లో ఎక్కువసార్లు చూసిన సినిమా మాత్రం తన తొలి దర్శకత్వంలో తెరకెక్కించిన 'జానీ'నే అని ఇంటర్వ్యూలలో వెల్లడించారు. నిజమే జానీ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు, అభిమానులను కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కు ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రేణు దేశాయ్ నటించడం మరో విశేషం.
Details
జానీ మూవీని ఎక్కువసార్లు చూశారు
ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ అవుతుందనే ఆశతో డైరెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్. కానీ కథ, కాన్సెప్ట్ ప్రేక్షకులకు పెద్దగా నప్పకపోవడంతో సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయినప్పటికీ 'జానీ' ఆయనకు ఎప్పటికీ ప్రియమైన చిత్రంగానే నిలిచింది. ఆయన కెరీర్‌లో ఎక్కువసార్లు చూసిన సినిమా కూడా ఇదే అని స్వయంగా అంగీకరించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు ప్రస్తావించారు. ఆశ్చర్యం ఏమిటంటే 'జానీ' సినిమా ఫ్లాప్ అయిందని పవన్ కళ్యాణ్ స్వయంగా స్టేజ్ ఈవెంట్స్‌లో కూడా ఓపెన్‌గా చెప్పిన సందర్భాలున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన సినిమాలు, ప్రత్యేకమైన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ సంబరాలు జరుపుతున్నారు.