
Mahesh Babu: రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనంటూ ప్రచారం
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు హీరోగా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అయితే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి అప్డేట్ ఏమైనా వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో అతృతగా ఎదురుచూశారు.
కానీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
విజువల్ డెవలప్ మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ ఇందుకు కారణం.
Details
అధికారిక ప్రకటన వెలువడలేదు
దీంతో మహేష్ బాబు కొత్త సినిమాకు గరుడ అనే టైటిల్ పెట్టనున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.
ఈ గరుడు ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. గతంలో రాజమౌళినే ఈ టైటిల్‌ను స్వయంగా ప్రకటించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ మూవీలో మహేష్ బాబు సరికొత్త అవతారంలో అభిమానులకు కనిపించనున్నారు. మూవీ టీమ్ కూడా మహేష్ బాబు లుక్ కోసం సిద్ధమవుతున్నారు.
సోషల్ మీడియాలో పొడవాటి జుట్టు, గడ్డంతో ఇప్పటివరకూ కనిపించని కొత్త గెటప్‌లో కనిపించనున్నారు.