
ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో వస్తుంటాయి. ఈ వారం ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.
సగిలేటి కథ:
రవి మహదాస్యం, విషికా లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన రాయలసీమ ప్రాంత నేపథ్యంలో సాగే కథ సగిలేటి కథ.
రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదలవుతుంది.
నీతోనే నేను:
వికాస్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్ళపు నటించిన నీతోనే నేను చిత్రాన్ని అంజి రామ్ డైరెక్ట్ చేసారు. అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో నీతోనే నేను సందడి చేయనుంది.
Details
రాక్షస కావ్యం:
అన్వేష్ మైఖేల్, అభయ్ బేతిగంటి, కుషాలిని పులప ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం రాక్షస కావ్యం.
శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దాము రెడ్డి నిర్మాతగా ఉన్నారు. అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలోకి వస్తుంది.
ధక్ ధక్(హిందీ):
హీరోయిన్ తాప్సీ పన్ను నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ధక్ ధక్.
ఫాతిమా సనా షేక్, దియా మీర్జా, సంజనా సంఘి నటించిన ఈ సినిమా, అక్టోబర్ 13వ తేదీన థియేటర్ల్లఓ రిలీజ్ అవుతుంది.
Details
ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు
ఆహా:
మట్టి కథ - అక్టోబర్ 13నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
మిస్టేక్ - అక్టోబర్ 13 నుండి ఆహాలో అందుబాటులో ఉండనుంది.
జీ5:
ప్రేమ విమానం - సంగీత్ శోభన్, అనసూయ భరధ్వాజ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ప్రేమవిమానం.
సంతోష్ కాటా దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 12నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లలో అక్టోబర్ 13నుండి స్ట్రీమింగ్ అవుతుంది.