
ఈ వారం ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారం కొత్త కొత్త కంటెంట్ తో ఓటీటీ చానల్స్ తమ సబ్ స్క్రయిబర్లను అలరించడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ వారం కూడా సరికొత్త కంటెంట్ ని ఓటీటీ చానల్స్ తీసుకొస్తున్నాయి.
ఈవారం ఓటీటీ చానల్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం.
రజనీకాంత్ జైలర్:
రజనీకాంత్ హీరోగా రూపొందిన జైలర్ సినిమా థియేటర్లలో మోత మోగించింది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఓటీటీ ప్రేక్షకులను సెప్టెంబర్ 7వ తేదీ నుండి అలరించనుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.
Details
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న కంటెంట్
వన్ షాట్ అనే వెబ్ సిరీస్ ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది. సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ అనే ఇంగ్లీష్ సినిమా సెప్టెంబర్ 8 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
ది లిటిల్ మెర్ మయిడ్ (ఇంగ్లీష్)
ఐ యాం గ్రూట్ వెబ్ సిరీస్
జీ5:
నవాజుద్దీన్ సిద్ధికి ట్రాన్స్ జెండర్ గా కనిపిస్తున్న సినిమా హడ్డీ. అజయ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 ప్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 7వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
నెట్ ఫ్లిక్స్:
కుంగ్ ఫు పాండా వెబ్ సిరీస్ ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.
రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ(ఇంగ్లీష్)
టాప్ బాయ్(ఇంగ్లీష్) సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.