Page Loader
Salman Khan: సల్మాన్‌ఖాన్‌కి అండర్‌ వరల్డ్‌నుంచి  బెదిరింపులు.. మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు
సల్మాన్‌ఖాన్‌కి అండర్‌ వరల్డ్‌నుంచి బెదిరింపులు.. మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

Salman Khan: సల్మాన్‌ఖాన్‌కి అండర్‌ వరల్డ్‌నుంచి  బెదిరింపులు.. మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2024
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమీ అలీ, తన బాలీవుడ్ అనుభవాల సమయంలో ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికర సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముఖ్యంగా, సల్మాన్ ఖాన్ అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులకు గురైన ఘటనపై పేర్కొంది. బాలీవుడ్‌లో ఉండగా ఆమె దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ వంటి అండర్‌వరల్డ్ డాన్ల గురించి చాలా మంది చర్చించడాన్ని విన్నానని సోమీ అలీ తెలిపారు. ఎవరూ కూడా వీరి గురించి ప్రత్యక్షంగా మాట్లాడే ధైర్యం చేసేవారు కాదని చెప్పారు. ఆమె సల్మాన్ ఖాన్‌తో మూడు సంవత్సరాలు గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉన్న సమయంలో సల్మాన్‌కు అండర్‌వరల్డ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపింది.

Details

ఆ మాటలు భయపెట్టాయి : సోమీ అలీ

ఆ కాల్‌ చేసిన వ్యక్తి 'సల్మాన్‌కు చెప్పు, అతని ప్రియురాలిని కిడ్నాప్ చేస్తామని బెదిరించాడని, ఆ మాటలు తనను ఎంతగానో భయపెట్టయాని చెప్పింది. ఆ బెదిరింపు వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేసినా, సల్మాన్ మాత్రం ఈ విషయాలకు దూరంగా ఉండడమే మంచిదని చెప్పారని సోమీ వెల్లడించారు. పాకిస్థానీ అమెరికన్ నటి అయిన సోమీ అలీ బాలీవుడ్‌లో 'ఆందోళన్', 'మాఫియా' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సల్మాన్‌తో కలిసి నటించిన సందర్భంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.