తదుపరి వార్తా కథనం

Yash: తీవ్ర విషాదం... గడగ్ జిల్లాలో స్టార్ హీరో అభిమానులు మృతి!
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 08, 2024
10:32 am
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని గడగ్ జిల్లాలో కన్నడ నటుడు యష్ 38వ పుట్టినరోజు కోసం ఆయన అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు.
ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. 2007లో 'జంబడ హుడుగి'తో కన్నడ చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేశాడు.
అతను 'రాకీ'(2008),'గూగ్లీ'(2013)'మిస్టర్ అండ్ మిస్ రామాచారి'(2014) తో ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నాడు.
బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్(KGF) సిరీస్‌లో రాకీ భాయ్ గా జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు.