Page Loader
ThugLife: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న థగ్ లైఫ్ టీజర్.. రిలీజ్ డేట్ ఇదే

ThugLife: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న థగ్ లైఫ్ టీజర్.. రిలీజ్ డేట్ ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) సంయుక్తంగా రూపొందిస్తున్న తాజా చిత్రం "థ‌గ్‌లైఫ్" (Thug Life) ఒక అద్భుతమైన కలయిక. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎంతో ప్రత్యేకమైనది. 1987లో వచ్చిన "నాయకన్" మూవీ తెలుగులో "నాయకుడు" పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరొకసారి ఈ కలయిక తెరపై కనిపించబోతుంది. ఇవాళ (నవంబర్ 7) గురువారం కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా "థ‌గ్‌లైఫ్" సినిమా టీజర్ విడుదలైంది.

వివరాలు 

"అతని కథ, అతని నియమాలు" క్యాప్షన్‌ 

"పయనీర్, ట్రైల్‌బ్లేజర్, మెంటర్ - ఇవి అన్ని పదాలు భారతీయ సినిమా, సమాజంపై మీ గొప్ప ప్రభావాన్ని మరింత పెంచుతాయి. విశ్వ నాయకుడు.. 'థ‌గ్‌లైఫ్' సినిమా కోసం తన అద్భుతమైన విజన్‌తో ముందుకు వస్తున్నారు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు కమల్ సార్" అని మేకర్స్ విషెస్ తెలియజేశారు. "అతని కథ, అతని నియమాలు" అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. "థ‌గ్‌లైఫ్" టీజర్ మరొక లెవెల్‌లో ఉంది. మణిరత్నం టేకింగ్, కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఏ ఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ గ్రాండ్‌గా ఉన్నాయి. మోస్ట్ స్టైలిష్ ఎంట్రీగా శింబు విలన్ (క్రిమినల్) పాత్రలో తన మార్క్‌ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

వివరాలు 

హీరోయిన్‌గా త్రిష

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, హీరో ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ 234వ చిత్రంగా "థ‌గ్‌లైఫ్" సినిమా రూపొందబోతోంది. ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో శింబు, దుల్కర్ సల్మాన్, జయం రవి, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, ఐశ్వర్యలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. "థ‌గ్‌లైఫ్" 2025 జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.