టైగర్ నాగేశ్వర్ రావు పాన్ ఇండియా ప్లాన్: ఐదుగురు స్టార్స్ వచ్చేస్తున్నారు
ఈ వార్తాకథనం ఏంటి
రావణాసుర ఫ్లాప్ తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.
పేరుకు మాత్రమే పాన్ ఇండియా అని కాకుండా, ఇతర భాషల మార్కెట్ పై గట్టి ఫోకస్ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.
టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్ కోసం అన్ని భాషల నుండి స్టార్స్ ని తీసుకొస్తున్నారు. అవును, ఈ నెల 24వ తేదీన టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది.
తెలుగులో వెంకటేష్, తమిళంలో కార్తీ, మళయాలంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో శివరాజ్ కుమార్, హిందీలో జాబ్ అబ్రహం.. టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారు.
Details
దసరా కనుకగా రిలీజ్ అవుతున్న చిత్రం
1970ల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లోని స్టూవర్ట్ పురం గ్రామ నేపథ్యంలో ఈ కథ ఉండనుందని, నాగేశ్వర్ రావు అనే దొంగ పాత్రలో రవితేజ కనిపిస్తాడని సమాచారం.
రవితేజ నుండి వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా పాన్ ఇండియాలో రవితేజ పాగా వేయగలడా లేదా చూడాలి.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
గాయత్రి భరధ్వాజ్, నుపుర్ సనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.