Page Loader
టైగర్ నాగేశ్వరరావు: జయవాణి పాత్రలో కనిపించబోతున్న అనుక్రీతి వ్యాస్ 
టైగర్ నాగేశ్వర్ రావు అనుక్రీతి వ్యాస్ లుక్ రిలీజ్

టైగర్ నాగేశ్వరరావు: జయవాణి పాత్రలో కనిపించబోతున్న అనుక్రీతి వ్యాస్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 29, 2023
06:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావు పాత్రలో కనిపించబోతున్న రవితేజ సరసన అనుక్రీతి వ్యాస్ జయవాణి పాత్రలో నటించనుందని మేకర్స్ తెలియజేశారు. ఈ మేరకు జయవాణిగా అనుక్రీతి వ్యాస్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అనుక్రీతి వ్యాస్ గతంలో విజయ్ సేతుపతి నటించిన డీఎస్పీ సినిమాలో కనిపించారు. కొత్త దర్శకుడు వంశీ రూపొందిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా, అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్