Page Loader
టైగర్‌ నాగేశ్వర రావు సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌
టైగర్‌ నాగేశ్వరరావు ప్రోమో రిలీజ్‌

టైగర్‌ నాగేశ్వర రావు సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ హీరోగా టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌ అయ్యింది. ఈ మేరకు మాస్ మహారాజా రవితేజ డ్యాన్సులతో అదరగొట్టారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. రవితేజ పాన్‌ ఇండియా మూవీని సెప్టెంబర్‌ 28న విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఏక్‌ ధమ్‌ ఏక్ ధమ్‌ అంటూ సాగే పాట ప్రోమో ఇవాళ విడుదలైంది. మంగళవారం ఈ పాటకు సంబంధించిన పూర్తి వీడియో రిలీజ్‌ కానుంది. రేణుదేశాయ్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. 70, 80 ద‌శ‌కాల్లో గజదొంగ నాగేశ్వర‌రావు ఏపీలో భారీగా దొంగ‌త‌నాలు, దోపిడీలతో త‌ప్పించుకునేవాడు. ఈ క్రమంలోనే బ‌యోపిక్‌గా తెర‌కెక్కుతున్న కారణంగా ఉత్కంఠ నెల‌కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఏక్‌ ధమ్‌ ఏక్ ధమ్‌ పాట ప్రోమో రిలీజ్