టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: రవితేజ పాన్ ఇండియా సినిమా ఎలా ఉందంటే?
మాస్ మహారాజా రవితేజ మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. ఈ సినిమాలో బాలీవుడ్ భామలు నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. కథ: స్టూవర్టుపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు(రవితేజ), తన ఏరియాలో మాత్రమే కాకుండా అన్ని ఏరియాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. ఆ ప్రాసెస్ లో అతనికి స్టూవర్టుపురంలోని ఇతర దొంగలతో గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద దొంగతనం చేయాలనుకుని, ఆ డబ్బుతో స్టూవర్టుపురం గ్రామాన్ని బాగుచేయాలని అనుకుంటాడు. అదే సమయంలో అతను ప్రేమలో పడతాడు. పెద్ద దొంగతనం చేసి ప్రేమించిన అమ్మాయితో సెటిల్ అవ్వాలని అనుకుంటుండగా, పోలీసులకు దొరికిపోయి జైల్లో పడతాడు. ఆ తర్వాత ఏమైందన్నదే కథ.
సినిమా ఎలా ఉందంటే?
టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రవితేజ అందరినీ ఆకట్టుకుంటాడు. గజదొంగగా రవితేజ పర్ఫామెన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లలో రవితేజ అదరగొట్టాడు. ఫస్టాఫ్ లో నాగేశ్వరరావు దొంగతనాల గురించి, అతని ప్రేమ గురించి చూపించారు. అంతేకాదు, ప్రథమార్థంలో మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ హ్యాపీగా సాగిపోతుంది. సెకండాఫ్ కి వచ్చేసరికి కథలో కొన్ని మైనస్ పాయింట్లు కనిపిస్తాయి. మొదట్లో నాగేశ్వరరావుని దొంగగా చూపిస్తారు. ఆ తర్వాత ఆ పాత్రను రాబిన్ హుడ్ తరహా పాత్రగా మార్చేస్తారు. తాను చేసిన దొంగతనం నుండి ఇతరులకు నాగేశ్వరరావు సహాయం చేస్తుంటాడు.
ప్లస్ పాయింట్స్
టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి మేజర్ ప్లస్ రవితేజ పర్ఫామెన్స్. అలాగే నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. జీవీ ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం సీన్లను మరింత ఎలివేట్ చేసింది. మైనస్ పాయింట్స్: టైగర్ నాగేశ్వరరావు సినిమాకు సెకండ్ హాఫ్ మైనస్ గా మారింది. ముఖ్యంగా నిడివి మూడు గంటలు ఉండడం కొంత ఇబ్బంది కలిగించింది. అలాగే స్క్రీన్ ప్లే లో కన్ఫ్యూజన్స్ రావడం కూడా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించింది. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. చివరగా చెప్పేది ఏంటంటే? టైగర్ నాగేశ్వరరావు గురించి ప్రచారంలో ఉన్న కథలను ఉపయోగించుకొని వెండి తెరమీద ఆసక్తికరంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇందులో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.