Tiger Nageswara Rao: 'టైగర్ నాగేశ్వరరావు' ఓటీటీ రిలీజ్.. అనుకున్న డేట్ కంటే ముందుగానే స్ట్రీమింగ్
మాస్ మహరాజ్ రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాధరణ పొందలేకపోయింది. ఈ క్రమంలో ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా OTTస్ట్రీమింగ్ హక్కులను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే దానిపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. తొలుత ఈ సినిమా డిసెంబర్‌లో ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించినా.. మళ్లీ మనసు మార్చుకున్న మేకర్స్ అనుకున్న సమయానికి కంటే ముందే అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యారట. నవంబర్ 24న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ఓటీటీ స్టీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను రూ. 15కోట్లకు అమెజాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రెండు పరాజయాలతో ట్రాక్ తప్పిన మార్కెట్
ఈ ఏడాది రవితేజ నుంచి వచ్చిన రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు బ్యాక్-టు-బ్యాక్ పారజయం పాలయ్యాయి. ఈ క్రమంలో ఇక రాబోయే సినిమాలపై రవితేజ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందు ధమాకా, వాల్తేరు వీరయ్య విజయాలతో ఊపు మీద ఉన్న రవితేజ మార్కెట్‌ను రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో రాబోయే సినిమా ద్వారా తన సక్సెస్ గ్రాఫ్‌ను పునరుద్ధరించుకోవాలని రవితేజ భావిస్తున్నారు. అతను ఇప్పుడు కొత్త లేదా అనుభవం లేని దర్శకులతో రిస్క్‌లు తీసుకునే బదులు అనుభవజ్ఞులైన దర్శకులతో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడని నటుడి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.