గణపత్ టీజర్: టైగర్ ష్రాఫ్ కొత్త సినిమా టీజర్ ను లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో గణపత్ సినిమా రూపొందుతోంది. క్రితిసనన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర తెలుగు టీజర్ ని చిరంజీవి విడుదల చేసారు. టీజర్ మొదట్లోనే, కథంతా 2070లో జరగబోతుందని చూపించారు. వింత భవనాలు, ఫ్లయింగ్ రాకెట్లతో కొత్తకొత్తగా విజువల్స్ కనిపించాయి. టీజర్ మొత్తం యాక్షన్ సీక్వెన్సులే ఎక్కువగా కనిపించాయి. హీరోయిన్ క్రితిసనన్ కూడా యాక్షన్ సీక్వెన్సుల్లో మెరిసారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన గెటప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వికాస్ బహాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, పూజా ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోంది. విక్రమ్ మంత్రోస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.