Page Loader
Tillu Square హక్కులు పొందిన ప్రముఖ ఓటిటి .. వచ్చేది అప్పుడేనా?
Tillu Square హక్కులు పొందిన ప్రముఖ ఓటిటి .. వచ్చేది అప్పుడేనా?

Tillu Square హక్కులు పొందిన ప్రముఖ ఓటిటి .. వచ్చేది అప్పుడేనా?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ డీజే టిల్లు సినిమా తెలుగు ప్రేక్షకులలో ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమా హిట్ తో మేకర్స్ ఈ సినిమా సెకండ్ పార్ట్ టిల్లు స్క్వేర్ ను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాలో సిద్దుకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయినట్లు సమాచారం.

Details 

డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందిన నెట్‍ఫ్లిక్స్

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట‍్‍ఫామ్ 'నెట్ ఫ్లిక్స్ ' సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపు 35 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నెల తర్వాత ఓటీటీలోకి విడుదల కానుందని సమాచారం. ఈ క్రైమ్ కామెడీలో ప్రిన్స్ సెసిల్, మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి కల్లెం, కీలక పాత్రలలో నటించారు. అతిధి పాత్రలో నేహా శెట్టి నటిస్తోంది. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. థమన్ మ్యూజిక్ ను అందించారు.