
Tillu Square Censor: టిల్లు స్క్వేర్ కి U/A సర్టిఫికెట్
ఈ వార్తాకథనం ఏంటి
'టిల్లు స్క్వేర్' మూవీకి సెన్సార్ U/A సర్టిఫికెట్ ని జారీ చేసింది. టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ మూవీ పై మంచి బజ్ నెలకొంది.
ఈ సినిమా మార్చ్ 29న విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నారు.
అయితే, ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ యూఏ సర్టిఫికెట్ వచ్చినట్టు ప్రకటించారు.
ఇది కుటుంబంతో కలిసి చూసే సినిమానే అని పేర్కొన్నారు. ఈ క్రేజీ సీక్వెల్ ను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ ను నిర్మించిన సితార ఎంటెర్టైన్మెంట్స్ ఈ సీక్వెల్ ను కూడా నిర్మిస్తున్నారు.
అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సితార ఎంటర్టైన్మెంట్స్ చేసిన ట్వీట్
#TilluSquare is certified with 𝐔/𝐀 ❤️🔥
— Sithara Entertainments (@SitharaEnts) March 22, 2024
Tillanna is ready to BLAST the screens with DOUBLE the FUN & ENTERTAINMENT! 😎🤘
Worldwide grand release at theatres near you on MARCH 29th! 🥳#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo… pic.twitter.com/kQpuu0AlFI