Page Loader
Game Changer: గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాటకి టైమ్ ఫిక్స్! 
గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాటకి టైమ్ ఫిక్స్!

Game Changer: గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాటకి టైమ్ ఫిక్స్! 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2024
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా,కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఫ్యాన్స్ కి అందించారు. గేమ్ చేంజర్ నుండి 'జరగండి జరగండి' పాటను రేపు ఉదయం 9గంటలకు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి వైబ్రెంట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నఈచిత్రంలో అంజలి, శ్రీకాంత్,ఎస్‌జె సూర్య,సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దర్శకుడు శంకర్ చేసిన ట్వీట్