Page Loader
Mahesh -Rajamouli : మహేష్,రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా..?
Mahesh -Rajamouli : మహేష్,రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా..?

Mahesh -Rajamouli : మహేష్,రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2024
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం ఫాన్స్ చాల కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే.. ఈ సినిమాపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ పై రూమర్స్ మొదలయ్యాయి. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు నెట్టింట వార్త చక్కర్లు కొడుతోంది. ఈ పేరులో మహేష్ బాబు, రాజమౌళి పేర్లు కలుస్తుండడంతో ఇదే టైటిల్ ఉండొచ్చని ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని సమాచారం..

Details

హీరోయిన్‌గా ఇండోనేషియా నటి 

ఇప్పటికే ఈసినిమాకి సంబంధించి రెండు మూడు రోజుల క్రితం టెక్నీకల్ క్రూ వీరే అంటూ ఒక న్యూస్ హల్చల్ చేసింది. దాని ప్రకారం ఈప్రతిష్టాత్మక మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎడిటర్ గా తమ్మిరాజు,సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్,విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా ఆర్ సి కమల కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగి,కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ గా రమా రాజమౌళి ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. అంతేకాకుండా,ఈచిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌(chelsea elizabeth islan) ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయనే వార్త కూడా వైరల్‌ అవుతోంది. దానికి ఒక కారణం ఉంది చెల్సియా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆవార్తలకు బలం చేకూరినట్లైంది.