Page Loader
Shiva Rajkumar: నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు : శివరాజ్ కుమార్ 
నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు : శివరాజ్ కుమార్

Shiva Rajkumar: నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు : శివరాజ్ కుమార్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల జరిగిన 'థగ్ లైఫ్' ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే అదే కార్యక్రమంలో కమల్ హాసన్ కన్నడ భాషపై మాట్లాడే సమయంలో శివరాజ్ కుమార్ చప్పట్లు కొట్టారని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ కాంట్రవర్సీపై తాజాగా శివరాజ్ కుమార్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. "తాను ఆ వ్యాఖ్యల సమయంలో చప్పట్లు కొట్టలేదని వెల్లడించారు. కమల్ హాసన్ 'కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన మాటలతో శివరాజ్ కుమార్ అప్రూవ్ చేసినట్టుగా చూపిస్తూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

Details

ఎడిటింగ్ లో తప్పుగా చూపించారు

దీనిపై స్పందించిన శివరాజ్ కుమార్, 'ప్రతి భాషకూ గౌరవం ఉంది. కానీ నా మాతృభాష కన్నడ. దానికి నా జీవితం కూడా అంకితం చేయడానికి సిద్ధం. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను. కమల్ హాసన్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. ఆయన నా ఫేవరెట్ స్టార్. ఆయన సీనియర్, నేను అభిమానిగా చూస్తానని అన్నారు. ఈవెంట్ సమయంలో చప్పట్లు కొట్టిన దృశ్యాలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. 'కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలు చెబుతున్నప్పుడు నేను క్లాప్స్ కొట్టలేదు. వేరే ఎవరో మాట్లాడుతున్న సమయంలో నేనే క్లాప్ చేశాను. కానీ ఎడిటింగ్‌లో ఆ దృశ్యం తప్పుగా చూపించారు. అప్పుడు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదని అన్నారు.

Details

భాషలపై మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదు

'థగ్ లైఫ్' సినిమాకు సంబంధించిన ఈవెంట్ జూన్ 5 రిలీజ్ సందర్భంగా భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ కూడా వివరణ ఇచ్చారు. 'తాను ప్రేమతోనే ఆ వ్యాఖ్యలు చేశానని, ప్రేమకు ఎప్పుడూ క్షమాపణలు అవసరం ఉండవని అన్నారు. భాష చరిత్రపై అనేక చరిత్రకారుల నుంచి సమాచారం తెలుసుకున్నానని, తన వ్యాఖ్యలకు ఎలాంటి ద్వేషం లేదా అవమాన భావన లేదని స్పష్టం చేశారు. భాషలపై మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని, అది తనకు కూడా వర్తిస్తుందన్నారు.