LOADING...
Pawan Kalyan: సినిమా తీయాలంటే యుద్ధాలు చేయాల్సిందే : పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan: సినిమా తీయాలంటే యుద్ధాలు చేయాల్సిందే : పవన్ కళ్యాణ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' జులై 24న పాన్‌ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. క్రిష్‌, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించగా, నిధి అగర్వాల్‌ కథానాయికగా నటించింది. ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు.

Details

సినిమా ప్రమోట్ చేయడం నాకు రాదు

పోడియం లేకుండా మాట్లాడడం కష్టంగా ఉందని నవ్వుతూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన పవన్, 'నా సినిమా జీవితం మొత్తం మీద ఇదే తొలిసారి మీడియాతో మాట్లాడుతున్నాను. ఎలా ప్రమోట్ చేయాలో అసలు తెలియదు. ఇంత కష్టపడ్డాం అని చెప్పడానికే కూడా మొహమాటంగా ఉంటుంది. మొదట సినిమాల్లోకి వచ్చినప్పుడు పేపర్లలో ఫొటోలు కూడా వేయలేదు. పబ్లిసిటీ లేకుండానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. సినిమాల గురించి మాట్లాడడమంటే నాకు కష్టమని అని చెప్పుకొచ్చారు.

Details

రత్నం గొప్ప మనిషి

ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాలనుకోవడానికి కారణం ఏఎం రత్నమని చెప్పారు పవన్. ''చిత్ర పరిశ్రమను పాన్‌ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయనే. ఈ సినిమా కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేను పాలిటిక్స్‌లోకి వెళ్లిపోయిన తర్వాత సినిమాకు సమయం కేటాయించలేకపోయాను. అయినా నా శాయశక్తులా కృషి చేశాను. గతంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకు ఎంతో ఉపయోగపడిందని వివరించారు.

Details

 క్లైమాక్స్‌ ప్రధాన ఆకర్షణ 

కోహినూర్ వజ్రం చుట్టూ కథ తిరుగుతుందని, క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రాణమని పవన్ పేర్కొన్నారు. 'ఇండస్ట్రీ ఒక్కోసారి చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డబ్బు కోసం కాదు, పరిశ్రమ కోసం నిలబడే వ్యక్తులే నిజమైన శిల్పులు. అందుకే ప్రత్యర్థులు విమర్శించినా ఈ మీటింగ్‌కు హాజరయ్యాను. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రత్నం పేరును నేను ప్రతిపాదించాను. సినిమా నా జీవనాధారం, అది నాకు ప్రాణవాయువు లాంటిదని వివరించారు.

Details

నా కుమారుడైనా ప్రతిభ లేనిదే నిలవలేడు 

'ఇతర హీరోల సినిమాల్లా నా సినిమాలకు పెద్దగా బిజినెస్‌ ఉండదు. కానీ నిధి అగర్వాల్‌ ఈ సినిమా ప్రమోషన్‌ భుజాలపై తీసుకుంది. ఇది అనాథ సినిమా కాదు. నేనున్నాను అని చెప్పడానికే వచ్చాను. సినిమాల సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ప్రజల కోసం నిలబడిన వ్యక్తిని. ఇండస్ట్రీలో కుల, మతాలకేం చోటు లేదు. ప్రతిభ ఉంటేనే నిలబడగలుగుతారు. రేపు నా కుమారుడైనా టాలెంట్‌ లేకపోతే నిలవలేడని పవన్ స్పష్టం చేశారు.

Details

2 గంటలకు లేచి ప్రాక్టీస్‌ చేశాను

ఈ సినిమా కోసం తెల్లవారుజామున రెండు గంటలకు లేచి సాధన చేశాను. జ్యోతికృష్ణ గొప్ప దర్శకుడు. నేను ఇతర హీరోల మాదిరిగా కొన్ని పనులు చేయలేను. 'సుస్వాగతం' సినిమాలో బస్సుపై ఎక్కి డ్యాన్స్‌ చేయాలనగా చేయలేక ఇబ్బంది పడ్డాను. అప్పుడే సినిమాలు మానేస్తానని మా వదిన సురేఖకి కూడా చెప్పాను. యాక్షన్ సీన్లు చేయగలిగే అవగాహన నాకుంది, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అని వేరు చేయడం నాకు నచ్చదని పవన్ అన్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ మాటల్లో 20 నిమిషాల ఫైట్ సీన్‌కు పవన్ కల్యాణే కొరియోగ్రఫీ చేశారట. నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ, పవన్‌ కల్యాణ్‌తో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు వెల్లడించారు.