Kartik Aaryan-Sreeleela: కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ వార్తలు.. హీరో తల్లి ఏమందంటే.!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan),నటి శ్రీలీల (Sreeleela) డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ఇటీవలి రోజుల్లో బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల హాజరయ్యిన తర్వాత ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో, తమ ఇంటికి కోడలిగా ఎలాంటి అమ్మాయి రావాలి అనే విషయంపై కార్తిక్ ఆర్యన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఐఫా' (IFFA) వేడుకల్లో పాల్గొన్న ఆమెను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కాబోయే కోడలిపై ప్రశ్నించగా, "మా ఇంటికి ఒక మంచి వైద్యురాలు కోడలిగా రావాలని మేము ఆశిస్తున్నాం" అని ఆమె తెలిపారు.
వివరాలు
అనురాగ్ బసు సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల
ఇదిలా ఉండగా,నటి శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోన్న విషయం తెలిసిందే.చదువుతో పాటు సినీ కెరీర్‌ను సమతూకంగా కొనసాగించడంపై ఆమె ఎన్నో సందర్భాల్లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక కార్తిక్-శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారనే వార్తల మధ్య హీరో తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తున్నాయి.
ఆమె వ్యాఖ్యలు శ్రీలీలను ఉద్దేశించి చేసినవేనని పలువురు భావిస్తున్నారు.దక్షిణాదిలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన శ్రీలీల, బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు రూపొందిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కార్తిక్-శ్రీలీల స్నేహం పెరిగిందని,అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
వివరాలు
డేటింగ్ వార్తలపై స్పందించిన కార్తిక్ ఆర్యన్, శ్రీలీల
అయితే, మరికొంతమంది మాత్రం వారి మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని, అందుకే శ్రీలీలను కార్తిక్ కుటుంబం పార్టీకి ఆహ్వానించిందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ డేటింగ్ వార్తలపై ఇప్పటివరకు కార్తిక్ ఆర్యన్ లేదా శ్రీలీల ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.