We Love Bad Boys : కడుపుబ్బా నవ్వించే 'వీ లవ్ బ్యాడ్ బాయ్స్' సెన్సార్ పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
వీ లవ్ బ్యాడ్ బాయ్స్, ఈ మాటలు వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఎందుకంటే అప్పట్లో ఆయన హీరోగా, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన 'బిజినెస్ మేన్' సినిమాలోని స్పెషల్ ఐటమ్ సాంగే ఈ 'వీ లవ్ బ్యాడ్ బాయ్స్'.
అయితే అప్పట్లో ఆ పాట మీద తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు మల్లీ ఆ పాట పేరు మీద ఏకంగా సినిమానే రెఢీ అయ్యింది.
'వీ లవ్ బ్యాడ్ బాయ్స్' పేరుతో టాలీవుడ్ సినిమా తెరకెక్కుతోంది.ఈ మేరకు సెన్సార్ సైతం పూర్తి చేసుకుంది.
అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి,రోమిక శర్మ,రోషిణి సహోట, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
details
త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం : నిర్మాత కనకదుర్గా రావు
కొత్త నిర్మాణ సంస్ధ బిఎమ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గా రావు నిర్మిస్తున్నారు.
రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ఇతర ముఖ్య తారాగణంగా నిలిచారు.
'వీ లవ్ బ్యాడ్ బాయ్స్' సినిమాను యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
'కడుపుబ్బే ఎంటర్‌టైనర్'గా సినిమా తీశామని, త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తామని ప్రొడ్యూసర్ పప్పుల కనక దుర్గా రావు పేర్కొన్నారు.
ఈతరం యువతీ యువకుల మనోభావాలకు అద్దం పట్టేలా కథాంశాన్ని తీర్చిదిద్దామన్నారు.సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ప్రశంసించారన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు.