Tollywood: టాలీవుడ్‌లో మరో అలజడి..పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాలివే
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న "పర్సంటేజ్ ఆధారిత ఆదాయ పంపిణీ" వివాదం కొత్త దశకు చేరుకుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అమలు చేయాలని భావిస్తున్న ఈ విధానం నుంచి తమ చిత్రాలను మినహాయించాలని పలువురు ప్రముఖ నిర్మాతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న 17 ప్రతిష్టాత్మక చిత్రాల జాబితాను నిర్మాతల మండలి సిద్ధం చేసినట్లు సమాచారం.
వివరాలు
పర్సంటేజ్ విధానం నుంచి మినహాయింపు కోరుతున్న 17 భారీ చిత్రాలు..
ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ కొత్త వ్యవస్థ ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో నిర్మాతలు మినహాయింపు కోరుతున్న చిత్రాలు ఇవే:Peddi (పెద్ది) - రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం.#TheParadise (ద పారడైజ్) - భారీ స్థాయిలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్.AK47 (ఏకే 47) - విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా.Vishwambhara (విశ్వంభర) - మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.#NBK111 - నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 111వ సినిమా.
వివరాలు
ఆ జాబితాలో మరిన్ని చిత్రాలు..
#Fauzi (ఫౌజీ) - ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్. Spirit (స్పిరిట్) - ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం. #Varanasi (వారణాసి) - ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా. #JaiHanuman (జై హనుమాన్) - ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం. #NtrNeel - జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్. #RaaKa (రాకా) - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం. #ChiruBobby2 / #Mega158 - చిరంజీవి, దర్శకుడు బాబీ మరోసారి కలిసి చేస్తున్న సినిమా. #AA23 - అల్లు అర్జున్ నటిస్తున్న 23వ చిత్రం.
వివరాలు
రామ్ చరణ్ సినిమాపై ప్రభావం..
#RC17 -రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా. Kalki2898AD Part-2 - ప్రభాస్, నాగ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న 'కల్కి' సీక్వెల్. #NaniSujeeth - నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కలయికలో రూపొందుతున్న చిత్రం. వెంకటేష్ - అనిల్ రావిపూడి చిత్రం - వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా. వాటిలో రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ వివాదం మొదటగా ఆ సినిమాపైనే ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎగ్జిబిటర్లు ఈ 17 చిత్రాలకు మినహాయింపు ఇవ్వడాన్ని అంగీకరించకపోతే, థియేటర్ల మూసివేత లేదా సినిమాల బహిష్కరణ, తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.