Sreeleela: టాలీవుడ్ సంచలనం శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాలు , రాజకీయాలు, క్రీడల్లో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం .అది మళ్లీ శ్రీలీల రూపంలో మనం చూడొచ్చు.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల తక్కువ కాలంలోనే చాలా స్టార్‌డమ్ తెచ్చుకున్నారు.
అందంతో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేయడం కూడా ఈ తెలుగమ్మాయికి కలిసి వచ్చింది. దీంతో స్టార్ హీరోలతో వరుసగా సినిమాల్లో శ్రీలీల ఛాన్స్ వరుసగా దక్కించుకున్నారు.
అయితే, బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు బోల్తా కొట్టడంతో ఇటీవల ఆమెకు అవకాశాలు కాస్త తగ్గాయి.
అయితే, మళ్లీ జోరు పెంచారు. త్వరలోనే శ్రీలీల బాలీవుడ్‍లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఆమె కాల్షీట్ల కోసం గతంలో నిర్మాతలు క్యూ కట్టిన సంగతి విదితమే.
డీటెయిల్స్
స్టార్ నటుడి కొడుకు సినిమాలో..
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటిస్తున్నచిత్రంలో శ్రీలీల హీరోయిన్‍గా అవకాశం దక్కించుకున్నారని తెలుస్తోంది.
దిలేర్ పేరుతో రూపొందనున్నఈ మూవీలో ఇబ్రహీం సరసన శ్రీలీల హీరోయిన్‍గా ఎంపికయ్యారని బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
దిలేర్ చిత్రానికి కృణాల్ దేశ్‍ముఖ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈమూవీ కోసం ఇప్పటికే శ్రీలీలకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట మేకర్స్.
ఈ చిత్రాన్ని మాడ్‍డాక్ ఫిల్మ్స్ పతాకంపై వినేశ్ విజన్,పూజా విజన్ నిర్మిస్తున్నారు.
దిలేర్ మూవీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కాస్త జరిగింది.
శ్రీలీల వచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలని మూవీ టీమ్ నిర్ణయించిందని తెలుస్తోంది. 2025లోఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.