తదుపరి వార్తా కథనం

Singer Mangli: గాయని మంగ్లీకి తప్పిన ప్రమాదం
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 18, 2024
09:08 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీ కొట్టింది.
రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై శనివారం అర్థరాత్రి తరువాత ఆమె ఇంటికి బయలుదేరారు.
తొండుపల్లి వంతెన వద్దకు రాగానే ఓ డీసీఎం వెనుక నుంచి వేగంగా వచ్చి ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది.
దీంతో మంగ్లీతో సహా కారులో ఉన్న మరో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంగ్లీ కారుకు యాక్సిడెంట్
పెను ప్రమాదం నుంచి బయట పడ్డ సింగర్ మంగ్లీ.. కారుకు యాక్సిడెంట్#SingerMangli #Accident #Tollywood https://t.co/Y9HXeLoGaI
— TV9 Telugu (@TV9Telugu) March 18, 2024