Page Loader
Trisha: టాలీవుడ్ లో తగ్గని త్రిష క్రేజ్.. ఏకంగా బాలయ్య సినిమాలో ఛాన్స్!
టాలీవుడ్ తగ్గని త్రిష క్రేజ్.. ఏకంగా బాలయ్య సినిమాలో ఛాన్స్!

Trisha: టాలీవుడ్ లో తగ్గని త్రిష క్రేజ్.. ఏకంగా బాలయ్య సినిమాలో ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2023
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా త్రిష ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. అదే సమయంలో ఆ స్టార్ స్టేటస్‌ను తమిళంలోనూ చూసింది. త్రిష సినీ ఇండిస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు దాటినా ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గటం లేదు. చాలాకాలం పాటు తన జోరును చూపించిన తర్వాత, రెండు బాషల్లోనూ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలో అమె తమిళంలో నాయిక ప్రధానమైన కథలను ఎంచుకుంది.'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో ఆమె పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ ను చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో ఆమెకి కోలీవుడ్ సీనియర్ హీరోల సరసన అవకాశాలు రావడం మొదలయ్యాయి.

Details

వరుస సినిమాలతో త్రిష బిజీ

ఇక లియో ఛాన్స్ కూడా అలానే వచ్చింది. ఈ సినిమాలోనూ త్రిష చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనుకి పైగా మూవీస్ ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ప్రెజెంట్ హీరోయిన్స్‌కు టఫ్ ఫైట్ ఇస్తోంది. అంతేకాదు రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే అందుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమె జతకట్టడం ఖాయమని చాలామంది అనుకుంటున్నారు. తాజాగా బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను, సితార బ్యానర్ వారు నిర్మించనున్నారు. ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రిభినయం చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సైట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.