
Kubera : 'కుబేర' సక్సెస్‌తో పుంజుకున్న టాలీవుడ్.. మళ్లీ హౌస్‌ఫుల్ హంగామా!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం థియేటర్లకు వచ్చే జనం రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో సినీ పరిశ్రమ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ నామమాత్రం కావడమే కాకుండా, చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టికి రాకుండానే మాయవుతున్నాయి. ఒకప్పుడు హిట్‌ల జోరుతో సాగిన సమ్మర్ సీజన్ ఈసారి పూర్తిగా నిరాశపరిచింది. నాని 'హిట్-3' తరువాత ఒక నెల పాటు బాక్సాఫీస్ ఖాళీగా కనిపించింది. జూన్ నెలపై కొంత ఆశ పెట్టుకున్న ఇండస్ట్రీకి, మొదటి వారంలో 'థగ్ లైఫ్' డిజాస్టర్ కావడం, తదుపరి రానున్న 'హరిహర వీరమల్లు' వాయిదా పడటంతో మరింత నిరాశ మిగిలింది. ఇలాంటి కష్టకాలంలో ప్రేక్షకుల రుచికి సరిపడే కంటెంట్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల మళ్లీ థియేటర్లకు ప్రాణం పోశారు.
Details
తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన 'కుబేర' సినిమా రిలీజ్ రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రిలీజ్ తరువాత కూడా ప్రేక్షకుల మౌత్‌టాక్, రివ్యూల ద్వారా విశేష స్పందన రాబడుతోంది. ఆ ప్రభావంతో థియేటర్ల ముందు మళ్లీ 'హౌస్‌ఫుల్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్స్ వేగంగా నిండిపోతున్నాయి, కొన్నిచోట్ల షోలు పూర్తిగా సేల్ అవుతున్నాయి. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే 'కుబేర' సినిమా ధనుష్ కెరీర్‌లోనే ఒక పెద్ద హిట్‌గా నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. నాగార్జునకూ ఇది ఒక మంచి కమర్షియల్ హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి, 'కుబేర' విజయంతో ఇండస్ట్రీ మొత్తం మళ్లీ ఊపిరి పీలుస్తోంది.