Page Loader
త్వరలోనే 'బస్టాప్' హీరోయిన్ లవ్ మ్యారేజ్.. ఆమె ఎవరో తెలుసా
త్వరలోనే మరో తెలుగు హీరోయిన్ లవ్ మ్యారేజ్

త్వరలోనే 'బస్టాప్' హీరోయిన్ లవ్ మ్యారేజ్.. ఆమె ఎవరో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 31, 2023
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందిన 'బస్టాప్', 'కేరింత' సినిమాల్లో శ్రీదివ్య నటించింది. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదివ్య తెలుగమ్మాయే. అనంతరం కోలీవుడ్ లో తమిళ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైపోయింది. శివకార్తికేయన్‌ 'వరుత్తపడాద వాలిబర్‌ సంఘం' అనే చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో శ్రీదివ్యకు వరసగా ఛాన్సులు వచ్చాయి. 'కాక్కీ సట్టై', 'జీవా', 'ఈటీ', 'మరుదు', 'బెంగుళూర్‌ నాట్కల్‌', 'పెన్సిల్‌' తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం విక్రమ్‌ ప్రభు 'రైడ్‌' సినిమాలో హీరోయిన్‌గా ఆడిపాడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

details

శ్రీదివ్య లవర్ ఎవరా అని ఆరాతీస్తున్న ప్రేక్షకులు

సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీదివ్యని ప్రేమ, పెళ్లి గురించి ఓ విలేకరి అడిగాడు. ఈ మేరకు స్పందించిన స్మార్ట్ బ్యాటీ, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, అదీ లవ్ మ్యారేజ్ అని స్పష్టం చేశారు. దీంతో శ్రీదివ్య లవర్ ఎవరా అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ వివాహానికి సర్వం సిద్ధమైంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడిన నాగాబాబు కుమారుడు, ప్రేమ పెళ్లితో ఓ ఇంటి వాడు కానున్నాడు. ఇప్పుడు శ్రీదివ్య రూపంలో మరో తెలుగు హీరోయిన్ ప్రేమలో పడినట్లైంది.