Page Loader
Mamta Kulkarni: మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న అగ్రనటి మమతా కులకర్ణి
మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న అగ్రనటి మమతా కులకర్ణి

Mamta Kulkarni: మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న అగ్రనటి మమతా కులకర్ణి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్)లో జరుగుతున్న మహా కుంభమేళాలో బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది. జనవరి 24న మహాకుంభమేళాకు వెళ్లిన ఆమె తన జీవితం దేవుడికి అంకితం చేసి, ఇక నుంచి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా ఆమె తన పేరును 'శ్రీ యామై మమత నందగిరి'గా మార్చుకుంది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఒకప్పుడు అగ్ర హీరోయిన్లలో ఒకరిగా మమతా కులకర్ణి పేరు పొందింది.

Details

20ఏళ్ల క్రితం నటనకు గుడ్ బై

కరణ్ అర్జున్, క్రాంతివీర్, సబ్‌సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాల్లోనూ నటించింది. అయితే, అకస్మాత్తుగా 20 ఏండ్ల క్రితం నటనకు గుడ్ బై చెప్పిన ఆమె, విదేశాల్లో స్థిరపడింది. ఇప్పుడు మహాకుంభమేళాలో తన సన్యాసాన్ని ప్రకటించి హాట్ టాపిక్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి