Giri Babu: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు గిరిబాబు కన్నుమూత!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు గిరిబాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామంలో జన్మించిన ఆయన.. 'జగమే మాయ' చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
వివరాలు
నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గిరిబాబు తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కించారు.
'సింహ గర్జన', 'మెరుపుదాడి', 'ఇంద్రజిత్' తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే 'రణరంగం', 'ఇంద్రజిత్', 'నీ సుఖమే నే కోరుకున్నా' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిరిబాబు సతీమణి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు.
ఆయనకు రఘుబాబు, బోసుబాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రఘుబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా కొనసాగుతున్నారు.
2023లో విడుదలైన 'అన్నీ మంచి శకునములే' గిరిబాబు నటించిన చివరి చిత్రంగా నిలిచింది.