Trisha: అన్నాడీఎంకే మాజీ నేతపై నటి త్రిష పరువు నష్టం దావా
ఈ వార్తాకథనం ఏంటి
ఎఐఎడిఎంకె మాజీ నేత ఎవి రాజు తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటి త్రిష పరువు నష్టం కేసు పెట్టారు.
గురువారం నాడు త్రిష తన సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా సదరు వివరాలను పంచుకున్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడుతూ.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆ వార్తలు, వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయ్యాయి. ఈ విషయమై ప్రజలు రాజు వ్యాఖ్యలను ఖండించారు. త్రిష అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫిబ్రవరి 17న ఏవీ రాజును ఏఐఏడీఎంకే నుంచి తొలగించారు.
Details
మన్సూర్ అలీఖాన్ విషయంలో కూడా లీగల్ గా..
కాగా అంతకముందు, తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ విషయంలో కూడా త్రిష.. లీగల్ గా వెళ్లి అతడికి తగిన గుణపాఠం చెప్పారు.
త్రిష పై అసభ్యకర కామెంట్స్ చేసినందుకు కోర్టు.. మన్సూర్ ని మందలించింది.
ఇక, త్రిష చివరిసారిగా తలపతి విజయ్ లియోలో కనిపించింది. ఆమె త్వరలో విడా ముయార్చిలో అజిత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
తెలుగులో విశ్వంభర చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తోంది.