Viswambhara: 'విశ్వంభర' సెట్స్‌లో అడుగుపెట్టిన హీరోయిన్ త్రిష
పద్మవిభూషణ్ చిరంజీవి,బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి కాంబోలో రానున్న గ్రాండ్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. ప్రస్తుతం ఈచిత్రం నిర్మాణ దశలో ఉంది.చిరంజీవి ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈచిత్ర యూనిట్ మరో భారీ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విశ్వంభర సెట్‌లో చేరిన త్రిషకు సాదర స్వాగతం పలికిన ఫోటోను ప్రముఖ నటుడు చిరంజీవి పోస్ట్ చేశారు. చిరు,త్రిష 18 సంవత్సరాల ముందు స్టాలిన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.ఆమె విశ్వంభర మూవీ లో జాయిన్ అవ్వడం పట్ల టీమ్ మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.యూవీక్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల అవుతుంది.