Prabhas : ప్రభాస్ సినిమాలో విలన్‌గా త్రిష. సందీర్ రెడ్డి వంగా భారీ స్కెచ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.
ప్రభాస్ మాత్రమే ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ అని ప్రకటించేస్తున్నారు. ఇక కల్కి సినిమాతో ప్రభాస్ రేంజ్ మరో లెవల్‌కు వెళ్లిపోయింది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇందులో స్పిరిట్ ఒకటి. యానిమల్ బ్లాక్ బాస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
Details
త్రిష పాత్రకు నెగిటివ్ షేడ్స్?
స్పిరిట్ మూవీలో త్రిష నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో త్రిష కథానాయికగా కనిపించనున్నట్లు సమాచారం.
అయితే అమె పాత్రకు ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. లేడీ విలన్‌గా త్రిషను చూపించడానికి సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేశారట.
అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమార్లు మాత్రమేనని, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.