Loading...
Trivikram Srinivas: త్రివిక్రమ్‌ ఆడుటున్న సేఫ్‌గేమ్‌... పక్కా ప్లానింగ్
త్రివిక్రమ్‌ ఆడుటున్న సేఫ్‌గేమ్‌... పక్కా ప్లానింగ్

Trivikram Srinivas: త్రివిక్రమ్‌ ఆడుటున్న సేఫ్‌గేమ్‌... పక్కా ప్లానింగ్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 20, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన దృష్టి జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేయాల్సిన భారీ ప్రాజెక్ట్‌ 'గాడ్‌ ఆఫ్‌ వార్‌'పైనే ఉన్నప్పటికీ, ఈ సినిమా వెంటనే సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. 'ఆదర్శ కుటుంబం' తర్వాత ఎన్టీఆర్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉంది. అయితే ప్రాజెక్ట్‌ ప్రారంభానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ గ్యాప్‌ను ఖాళీగా వదిలేయకుండా మరో సినిమా చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Details

చిరంజీవితో సినిమా కోసం చర్చలు

ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవితో త్రివిక్రమ్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితే టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి 'కాకా' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా పూర్తయ్యాకే తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే త్రివిక్రమ్‌ కూడా పరిస్థితిని బట్టి తన ప్లాన్‌ను మార్చుకునేలా ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

Details

చిరు కాకపోతే సూర్యతో జత కట్టే ఛాన్స్

చిరంజీవి సినిమా ఆలస్యమైతే మరో ఆప్షన్‌గా కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యను త్రివిక్రమ్‌ పరిశీలిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

సూర్య ఇప్పటికే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఓ సినిమా చేయడానికి కమిట్‌ అయ్యాడని సమాచారం. అదే సమయంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించేందుకు సూర్య కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ కాంబినేషన్‌ విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చనే చర్చ సాగుతోంది.

ఒకవైపు మెగాస్టార్‌.. మరోవైపు సూర్య.. ఇద్దరిలో ఎవరు ఓకే చెప్పినా త్రివిక్రమ్‌ తదుపరి సినిమా విషయంలో ముందుకు వెళ్లేలా ప్లాన్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

ADVERTISEMENT

Details

గ్యాప్‌ను కూడా వదలని మాటల మాంత్రికుడు

సినిమా మొదలయ్యే వరకు ఎదురుచూసే బదులు ఆ సమయంలో మరో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే ఆలోచన త్రివిక్రమ్‌ ప్లానింగ్‌లో కనిపిస్తోంది.

'గాడ్‌ ఆఫ్‌ వార్‌' ఆలస్యమైతే చిరంజీవితో సినిమా.. ఆ కాంబినేషన్‌ కూడా కుదరకపోతే సూర్యతో ప్రాజెక్ట్‌ అనేలా రెండు మార్గాలను సిద్ధంగా ఉంచుకున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

అయితే వీటిలో ఏ సినిమా ముందుగా పట్టాలెక్కుతుందనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతానికి మాత్రం త్రివిక్రమ్‌ తన కెరీర్‌లో తదుపరి అడుగును చాలా జాగ్రత్తగా వేస్తున్నాడనే టాక్‌ బలంగా వినిపిస్తోంది.

ADVERTISEMENT