ఓటిటి: జనవరిలో థియేటర్లలో రిలీజైన చిత్రాలు ఈ వారం ఓటీటిలోకి
ఈ వారం ఓటిటిలో తెలుగు సినిమాలు రెండు తెలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లలో రిలీజై ఎక్కువ రోజులు కాకముందే ఓటిటి ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ మూవీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 10వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవనుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. సుధీర్ బాబు నుండి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ తర్వాత వచ్చిన యాక్షన్ డ్రామా హంట్ కూడా అపజయం పాలైంది. మరి ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. ఇక ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న మరో సినిమా కళ్యాణం కమనీయం.
ఆహాలో స్ట్రీమింగ్ అవనున్న కళ్యాణం కమనీయం
సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం చిత్రంలో, జాబ్ లేని యువకుడు పెళ్ళి చేసుకున్న తర్వాత తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది చూపించారు. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం, పెద్ద చిత్రాల తాకిడికి తట్టుకోలేకపోయింది. కాకపోతే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్స్ రూపంలో మంచి బిజినెస్ జరిగిందని సమాచారం. థియేటర్లలో మెప్పించలేకపోయిన కళ్యాణం కమనీయం, ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహాలో ఈ నెల 10వ తేదీ నుండి స్టీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి. మొత్తానికి ఈ వారంలో ఓటిటి వేదికగా రెండు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అది కూడా రెండూ కూడా వేరు వేరు జోనర్లలో ఉన్నాయి.