Page Loader
Tyson Naidu: టైసన్ నాయుడుగా బెల్లంకొండ శ్రీనివాస్.. గ్లింప్స్ విడుదల
Tyson Naidu: టైసన్ నాయుడుగా బెల్లంకొండ శ్రీనివాస్.. గ్లింప్స్ విడుదల

Tyson Naidu: టైసన్ నాయుడుగా బెల్లంకొండ శ్రీనివాస్.. గ్లింప్స్ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 03, 2024
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్,భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి టైసన్ నాయుడు అనే టైటిల్ పెట్టారు.ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ గ్లింప్స్ వీడియోలో బెల్లంకొండ శ్రీనివాస్‌ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా కనిపిస్తాడు.ఈ గ్లింప్స్ లో శ్రీనివాస్ డీఎస్పీగా కనపడతాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది.రామ్ ఆచంట,గోపి ఆచంట నిర్మాతలు ,హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ నిర్మాత. సినిమాటోగ్రాఫర్ ముఖేష్ జ్ఞానేష్ క్యాప్చర్ చేసిన విజువల్స్ బాగున్నాయి.భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గ్లింప్స్ అదరహో అనిపించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్