Loading...
Sukesh Chandrashekhar Documentary: ఆర్థిక మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ జీవితంపై నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ
ఆర్థిక మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ జీవితంపై నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ

Sukesh Chandrashekhar Documentary: ఆర్థిక మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ జీవితంపై నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 26, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

వందల కోట్ల ఆర్థిక మోసాలు, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు,బాలీవుడ్‌ సెలబ్రిటీలతో సంబంధాలు.. ఇలా ఎన్నో సంచలనాలకు కేంద్రంగా నిలిచిన సుకేశ్‌ చంద్రశేఖర్‌ జీవితం ఇప్పుడు డాక్యుమెంటరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ 'లవ్, స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ' పేరుతో ఈ ట్రూ-క్రైమ్‌ డాక్యుమెంటరీని ప్రకటించింది. డిసెంబర్‌ 18, 2026 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది. సుకేశ్‌ మోసాల వెనుక అసలు కథ ఏమిటి? అతను అంతటి ప్రభావవంతమైన వ్యక్తులను ఎలా నమ్మించాడు? అనే అంశాలపై ప్రధానంగా ఫోకస్‌ చేయనున్నారు.

Details

బెంగళూరు నుంచి మొదలైన ప్రయాణం..

సుకేశ్‌ చంద్రశేఖర్‌ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అతని భారీ మోసాలే.

అయితే అతని ప్రయాణం మొదటి నుంచే ఇంత పెద్ద స్థాయిలో లేదు. బెంగళూరులో సాధారణ స్థాయి నుంచి మొదలైన అతని ప్రస్థానం క్రమంగా దేశంలోని పలువురు ప్రముఖులను ప్రభావితం చేసే స్థాయికి ఎలా చేరిందన్నది డాక్యుమెంటరీలో ఆసక్తికరంగా చూపించనున్నారు.

రాజకీయ నాయకులు, బాలీవుడ్‌ ప్రముఖులతో అతనికి ఏర్పడిన పరిచయాలు ఎలా పెరిగాయి? ఖరీదైన బహుమతులు, విలాసవంతమైన జీవితం వెనుక అసలు వ్యవహారం ఏమిటి? అనే విషయాలను కూడా ఇందులో వివరించనున్నారు.

Details

జైలు నుంచే నెట్‌వర్క్‌ ఎలా నడిచింది?

ఈ కథలో అందరినీ ఆశ్చర్యపరిచే మరో అంశం సుకేశ్‌ జైలులో ఉన్న సమయంలోనూ కొనసాగిన వ్యవహారాలే. రెండేళ్లకు పైగా సాగిన లోతైన పరిశోధన ఆధారంగా డాక్యుమెంటరీని రూపొందించినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

తీహార్‌ జైలులో ఉంటూనే తన మోసాల నెట్‌వర్క్‌ను ఎలా నడిపించాడు? వ్యవస్థలోని ఏ లోపాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు? నకిలీ గుర్తింపులు, నమ్మకాన్ని కలిగించే మాటలతో ఎదుటివారిని ఎలా మోసం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ సిరీస్‌ వెతకనుంది.

ADVERTISEMENT

Details

గతంలోనూ సంచలన డాక్యుమెంటరీలు..

ఈ డాక్యుమెంటరీకి మౌమితా సేన్‌, నియంత శేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

సుకేశ్‌ కథను కేవలం వార్తల్లో వచ్చిన సంఘటనలుగా చూపించకుండా, అతని ఎదుగుదల, మోసాల తీరు, ప్రముఖులతో సంబంధాలు, వ్యవస్థలోని బలహీనతలను కలిపి ఒక కథలా చెప్పే ప్రయత్నం చేశారు.

గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'కర్రీ అండ్‌ సైనైడ్‌: ది జాలీ జోసెఫ్‌ కేస్‌', 'ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌' వంటి సంచలనాత్మక డాక్యుమెంటరీలను రూపొందించిన బృందమే ఈ ప్రాజెక్ట్‌పైనా పనిచేసింది.

దీంతో సుకేశ్‌ జీవితంపై ఈ కొత్త సిరీస్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మొదలైంది.

ADVERTISEMENT