Ooru Peru Bhairavakona: మిస్టీరియస్ థ్రిల్లర్‌గా "ఊరు పేరు భైరవకోన" ట్రైలర్
VI ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. ఫిబ్రవరి 9, 2024న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రంలో సందీప్‌కి సరసన హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ నటించింది. ఈ సినిమా నుంచి ఫైనల్ గా మేకర్స్ ఇప్పుడే థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. భైరవకోన గ్రామంలో జరుగుతున్న ఆశ్చర్యకరమైన సంఘటనల సంగ్రహావలోకనాన్ని ఈ ట్రైలర్ లో మనం చూడవచ్చు. సినిమాలోని కొన్ని అంశాలను రహస్యంగా ఉంచుతూనే,పల్లెటూరితో ముడిపడి ఉన్న క్లిష్టమైన పజిల్‌లో కథానాయకుడు చిక్కుకున్నట్లు ట్రైలర్‌లో వెల్లడైంది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ లో మరో ప్రధాన ఆకర్షణ
శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ లో మరో ప్రధాన ఆకర్షణ . మొత్తానికి అయితే ఒక మిస్టరీ థ్రిల్లర్ ని నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ వారు ఈ ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి ట్రీట్ ని అందిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్,కుషీ రవి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.