Page Loader
సంక్షిప్తం చేయు
Mega Princess Klinkara:'ఎంత క్యూట్‌గా ఉందో చిన్ని తల్లి' ..మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన.. పోస్ట్ వైరల్
ఎంత క్యూట్‌గా ఉందో చిన్ని తల్లి' ..మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన.. పోస్ట్ వైరల్

Mega Princess Klinkara:'ఎంత క్యూట్‌గా ఉందో చిన్ని తల్లి' ..మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన.. పోస్ట్ వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌ సతీమణిగా, మెగా కుటుంబంలో కోడలిగా ఉన్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఆమె సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండి, కుటుంబానికి సంబంధించిన అనేక విశేషాలను తన అభిమానులతో నిరంతరం పంచుకుంటూ ఉంటుంది.

అయితే ఇప్పటివరకు ఉపాసన తన కుమార్తె క్లింకారా ముఖాన్ని పబ్లిక్‌గా ఎప్పుడూ చూపించలేదు.

ఈ కారణంగా, మెగా ఫ్యామిలీ అభిమానులు క్లింకారా ఫేస్‌ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి తరుణంలో, ఈరోజు క్లింకారా తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్‌ చేసి కూతురికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

వివరాలు 

జూ పార్కులో క్లింకారా తో ఉపాసన 

హైదరాబాద్లోని జూ పార్కులో తన గారాల పట్టితో కలిసి ఆనందంగా గడిపిన కొన్ని ఫొటోలను పంచుకుంటూ, ఆమె ఇలా పేర్కొన్నారు:

"ఒక సంవత్సరం క్రితం ఈ పులి ఒక్కటే ఉండేది.. చిన్నదిగా, మృదువుగా. ఇప్పుడు అది ఉల్లాసంగా, ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడది మా క్లింకారాతో తన పేరు పంచుకుంటుంది. ఈ అందమైన గుర్తుగా హైదరాబాదు జూ‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వన్యప్రాణులు అడవిలో ఉండాలి అనేది మా నమ్మకం. కానీ వాటి జీవితం పట్ల గౌరవాన్ని, జాగ్రత్తను కలిగించే ప్రయత్నాలను మేం సమర్థిస్తున్నాం. దయ, ధైర్యం, కరుణతో పెరిగే జీవితం ఇక్కడే ఉంది."

వివరాలు 

సోషల్ మీడియాలో వేగంగా వైరల్

ఈ పోస్టులో క్లింకారా ముఖం కొంతమేర రివీల్ కావడంతో అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది.

చిన్నారి క్లింకారాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అనేకమంది కామెంట్లు చేస్తున్నారు.

అలాగే "ఎంత అందంగా ఉంది ఈ చిన్నమ్మా", "చిన్న తల్లి ఎంత క్యూట్‌గా ఉందో!" అంటూ అభిమానులు కామెంట్స్‌తో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉపాసన చేసిన ట్వీట్