Urvshavi Rautela : ఆ వీడియో లీక్ చాలా బాధించింది.. ఊర్వశీ రౌతేలా
వాల్తేరు వీరయ్య సినిమాలో 'వేరే ఈజ్ ది పార్టీ' అంటూ డ్యాన్స్ చేసిన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా తెలుగులో అందరికి చేరువయ్యారు. బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలోనూ ఊర్వశీ నటిస్తోంది. అయితే ఈ నటికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె స్నానాల గదిలో దుస్తులు తొలగిస్తున్నట్లుగా ఉన్న ఆ క్లిప్ వైరల్ కావడంపై ఊర్వశీ తొలిసారి స్పందించారు. అది నిజమైన వీడియో కాదని, తాను నటిస్తున్న గుస్పేటియా అనే కొత్త సినిమాలో సీన్ అని అమె పేర్కొంది.
ఆగస్టు 9న గస్పేటియా రిలీజ్
సినిమా విడుదలకు ముందే వీడియోస్, ఫోటోలు లీక్ కావడం చాలా బాధ కలిగించింది. ఏ అమ్మాయికి ఇలాంటి చేదు అనుభవం ఎదరుకాకూడదని అమె చెప్పారు. గస్పేటియా సినిమాకు సూషి గణేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో కనిపిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 9న రిలీజ్ కానుంది.