ఉస్తాద్ భగత్ సింగ్ క్వాలిటీపై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల కంటే ముందుగా విడుదల చేయాలని ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారని సమాచారం. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారని నిర్మాణ సంస్థ వెల్లడి చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ 50శాతం పూర్తయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకానొక నెటిజన్, ట్విట్టర్ వేదికగా దర్శకుడు హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ, భగత్ సింగ్ సినిమా షూటింగ్ 50శాతం పూర్తయిపోయిందట కదన్నా, ఇక క్వాలిటీ గురించి దేవుడిపైనే భారం వేసాం అన్నాడు.
హరీష్ శంకర్ స్ట్రాంగ్ రిప్లై
నెటిజన్ కామెంట్ కి దర్శకుడు హరీష్ శంకర్ గట్టిగా స్పందించాడు. సినిమా క్వాలిటీపై నెటిజన్ కామెంట్ చేయడంతో, అంతే కదా తమ్ముడు, అంతకుమించి నువ్వేం చేయగలవు చెప్పు ఈ లోగా కాస్త కెరియర్ జాబ్ స్టడీస్ మీద ఫోకస్ పెట్టు. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు, ఆల్ ది బెస్ట్ అని కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ట్రీట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అదలా ఉంచితే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.