LOADING...
Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్

Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 14, 2026
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తేదీ ఖరారైంది. ఈ వేడుకను మార్చి 15న హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

వివరాలు

ఫ్యాన్స్ గెట్ రెడీ..

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా అభిమానులను ఉద్దేశిస్తూ ప్రత్యేకంగా స్పందించారు. "ఈసారి ఈవెంట్ బద్దలైపోవాలి ఫ్రెండ్స్" అంటూ ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో శనివారం సాయంత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ ఆసక్తి నెలకొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement