Page Loader
Ustaad Bhagat Singh:"గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం".. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీజర్ విడుదల 
Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీజర్ విడుదల

Ustaad Bhagat Singh:"గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం".. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీజర్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 19, 2024
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో పదేళ్ల కిందట వచ్చిన 'గబ్బర్‌ సింగ్‌' ఎలాంటి రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో సినిమా తెరకెక్కుతోంది.ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై చిత్ర యూనిట్ కాసేపటి క్రితమే భగత్' స్ బ్లేజ్ అంటూ టీజర్ విడుదల చేసింది. పొలిటికల్ టచ్ తో కూడిన ఈ పవర్ ఫుల్ వీడియో లో డైలాగ్స్ అదిరిపోయాయి.

Details 

గాజు పగిలేకొద్దీ పదును ఎక్కుది

ఇక జాతరతో మొదలైన ఈ టీజర్ లో టెంపర్ వంశీ.. "ఇది నీ రేంజ్" అంటూ టీ గ్లాస్ చూపించి క్రింద పడేస్తాడు. దీనికి దీటుగా అదిరిపోయే జవాబు ఇస్తాడు పవన్ కళ్యాణ్. "గాజు పగిలేకొద్దీ పదును ఎక్కుది. ఖచ్చితంగా గుర్తు పెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం" అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ అదుర్స్ . రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీట్